బాలీవుడ్ ‘వార్ లో ఎన్టీఆర్.. హృతిక్ తో కలిసి యాక్షన్ !

హృతిక్ రోషన్ హీరోగా బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2 రాబోతుంది. ఇటీవలే దీనికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సన్నిహిత వర్గాలు ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘వార్‌2’ (War 2)లో నటించడానికి ఎన్టీఆర్‌ అంగీకరించినట్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న స్పై యూనివర్స్‌ చిత్రాల వరుసలో ఇది ఏడవది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ నటిస్తున్నారు.