ఖుషి-ఓజీ.. సేమ్ టు సేమ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అప్ డేట్ ను స్వయంగా పవర్ స్టార్ ఇచ్చారు. ప్రస్తుతం ఓజీ షూటింగ్ మహారాష్ట్రలోని Wai lake దగ్గర జరుగుతుందని చెప్పారు. అక్కడ జనసైకులను కలిసిన ఫోటో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇక పవన్ షేర్ చేసిన ఫోటోలో ఆయన గెటప్.. ఖుషి సినిమాలోని ఓ సీన్ ని గుర్తు చేస్తోంది. ఖుషిలో పవన్ యోగ చేస్తున్న సీన్ లో ధరించిన డ్రెస్ ను ఇక్కడ కూడా ధరించారు. దీంతో 2000 లో ఖుషి.. ఇప్పుడు 2023లో ఓజీ అంటూ పోలికలు పెట్టి పోస్టులు పెడుతున్నారు.