Ganapath : ఫస్ట్ సింగిల్ #HumAayeHain సాంగ్ టీజర్ వచ్చేసింది

టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘గణపత్’. వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న గణపత్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. తాజాగా గణపత్ ఫస్ట్ సింగిల్ #HumAayeHain టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పూర్తి సాంగ్ ను రేపు విడుదల కానుంది. అయితే సాంగ్ టీజర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదిరిపోయే స్టెప్పులతో టైగర్ ష్రాఫ్-కృతి సనన్ అదరగొట్టారు.

ఈ ఏడాది టైగర్ ష్రాఫ్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే. కాగా కృతి సనన్ ఇప్పటికే రెండు సినిమాలతో అలరించింది. ఆమె నటించిన Shehzada, ఆదిపురుష్ చిత్రాలు ఈ ఏడాదియే రిలీజ్ అయ్యాయి. గణపత్ తో ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టనుంది కృతి. ఇవేకాకుండా మరో మూడు సినిమాలు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉండటం విశేషం.