పుష్ప 2 ఫస్ట్ సాంగ్.. వచ్చేస్తోంది !

పుష్ప మాస్ జాతర షురూ అయిన సంగతి తెలిసిందే. ఇక నుండి పుష్ప 2 నుండి వరుస అప్ డేట్స్ రాబోతున్నాయి. తాజాగా పుష్ప ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఫిక్సయింది. రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు పుష్ప 2లోని తొలి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ప్రకటించారు. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ పుష్ప 2 రేంజ్ ఏంటో చూపించబోతుందని చెబుతున్నారు.

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునే విధంగా సీక్వెల్ ను తీర్చిదిద్దుతున్నట్లు పలు వేదికల మీద దర్శకుడు సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. బన్నీ కూడా అస్సలు తగ్గేదేలా అంటూ పుష్ప 2పై అంచనాలు మరింతగా పెంచేశారు. భారీ అంచనాల మధ్య పుష్ప 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.