హరీష్ రావుపై బ్యాన్ నిజమే.. !


తెరాస అధినేత కేసీఆర్ ఎప్పుడూ నెం.1 నే. ఆయన నెం.2కు ఛాన్స్ ఇవ్వరు. అసలు పార్టీలో నెం.2ని ఉండనివ్వరు. తెరాస ఆవిర్భావ సమయంలో కేసీఆర్ తో కలిసి ఆలె నరేంద్ర ఉండేవారు. ఎప్పుడూ ఆయన పక్కనే కూర్చుండేవారు. కేసీఆర్ తర్వాత అన్నీ అయి చేసేవారు. ఆ తర్వాత కాలంలో ఆలె నరేంద్రకు కేసీఆర్ చెక్ పెట్టేశారు.

ఇక, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విజయశాంతితో కలిసి కేసీఆర్ పార్లమెంట్ లో కొట్టాడారు. బయట కూడా విజయశాంతి ఎప్పుడూ కేసీఆర్ పక్కనే ఉండేది. ఆమెకి పొమ్మనక పొగ పెట్టేశాడు. కొన్ని సమావేశాల్లో కేసీఆర్ పక్కనే కూర్చొని ఉన్న విజయశాంతికి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి అలాగే తయారైంది.

నర్సాపూర్ లో కెసిఆర్ ఎన్నికల ప్రచార సభ హరీష్ రావు మాట్లాడలేదు. సభ ఏర్పాట్లని అన్నీ దగ్గరై చూసుకొన్నారు హరీష్. ఐతే, కేసీఆర్ వేదికపైకి రాగానే హరీష్ సలైంట్ అయిపోయారు. కేసీఆర్ తన ప్రసంగంలోనూ హరీష్ పేరుని ప్రస్తావించలేదు. గతంలో కేసీఆర్ హరీష్ కు క్రిడెట్ ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా హరీష్ పేరుని బ్యాన్ చేసినట్టు కనబడుతోంది.

తెరాస ఆస్థాన టీవీ ఛానెల్ టీ న్యూస్’లో హరీష్ రావు పేరుని బ్యాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. హరీష్ కు సంబంధించిన వార్తలకి పెద్దగా ప్రాధ్యాన్యం ఇవ్వొద్దని టీవీ ఛానెల్ యాజమాన్యానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే వార్తలొచ్చాయ్. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ నే హరీష్ రావు పేరుని బ్యాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ బ్యాన్ ప్రచారం నిజమేనేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.