జగన్ ఓపెన్ అయ్యాడుగా.. !

జగన్ కేసీఆర్ మనిషిగా ముద్రపడిపోయింది. ఆయన బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ రెండు విషయాలపై జగన్ ఓపెన్ అయిపోయాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కేసీఆర్, మోడీలపై తన అభిప్రాయాలని పంచుకొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడమే వైకాపా ప్రథమ లక్ష్యం. దానికోసం తెలంగాణ ఎంపీలతో కలిసి పార్లమెంట్ లో కొట్టాడుతాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారు. అందుకు ఆయనకి కృతజ్ఝతలు. ఏపీ+తెలంగాణ ఎంపీలు మొత్తం 42మంది ఎంపీలతో కలిసి ఏపీ ప్రత్యేక హోదాపై నిలదీస్తామని తెలిపారు.

అదేసమయంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై జగన్ సానుకూలంగా స్పందించడం విశేషం. దేశం అంతటా మోడీ బాగా చేశారు. కానీ, ఏపీకి మాత్రం అన్యాయం చేశారని అన్నారు. మోడీ, రాహుల్‌లలో ఎవరు బలమైన ప్రధాని అభ్యర్థి అవుతారని జగన్ ని ప్రశ్నించగా.. ఆయన మోడీకే ఓటేశారు. అమేథీలో రాహుల్‌ పరిస్థితి అంత భద్రంగా లేదేమో. అందుకే ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు జగన్. ఎన్నికల తర్వాత ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారితోనే ఉంటామని జగన్‌ స్పష్టం చేశారు.