తెరాస ఎన్నికల ప్రచారంలో ఫ్యామిలీ హీరో !

ఖమ్మం కారుకు సినీ గ్లామర్ తోడైంది. హీరో వేణు ఖమ్మం తెరాస లోక్ సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక హోటల్ లో బజ్జీలు వేస్తూ ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

నామా వేణుకు బావ వరుస. ఆ బంధుత్వంతోనే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వేణు పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో నామా మహాకూటమి తరుపున ఖమ్మం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. బావ కోసం వేణు సైకిల్ ఎక్కి ఊరు వాడ తిరిగారు. కానీ, ఫలితం దక్కలేదు. ఎమ్మెల్యేగా నామా ఓటమి చెందారు. ఇటీవల నామా తెరాసలో చేరిన సంగతి తెలిసిందే.

తెరాస తరుపున ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు నామా. ఈ నేపథ్యంలో మరోసారి బావ కోసం ప్రచారంలో పాల్గొంటు
న్నారు ఫ్యామిలీ హీరో వేణు. బావని లోక్ సభకు పంపించాలనే కసితో ఎన్నికల ప్రచారం చేస్తుండు. మరీ.. హీరో వేణు శ్రమ ఫలిస్తుందా ? ఖమ్మం ఎంపీ నామా గెలుస్తాడా ?? అన్నది చూడాలి.