ఉగాధి కానుకగా బన్నీ సినిమా

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి ఉగాధి కానుక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన తదుపరి సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కనుంది. ఉగాధి రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు బన్నీ తాను చేయబోయే తదుపరి సినిమాల గురించి కూడా ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది.

త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మహేష్ బాబు కోసం సుకుమార్ అనుకొన్న కథతో బన్నీ సినిమా ఉండనుందట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండనుంది. దాంతోపాటు లవ్ ట్రాక్ ఉండనుందట. తమిళ్ స్టార్ దర్శకుడు ఎఆర్ మురగదాస్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఉగాధి రోజున ఈ సినిమాలపై బన్నీ ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది.