టాలీవుడ్ హీరోలపై రకుల్ జోక్స్

తిన్నింటి వాసాలు లెక్కించిన హీరోయిన్స్ ని చాలామందినే చూశాం. టాలీవుడ్ లో పేరు తెచ్చుకొని బాలీవుడ్ చెక్కేసిన హీరోయిన్స్.. అక్కడికెళ్లిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమని తక్కువ చేసి మాట్లాడటం చూశాం. హీరోయిన్ తాప్సీ ఇలాగే ప్రవర్థించింది. టాలీవుడ్ పై చీప్ కామెంట్స్ చేసి.. వివాదాలపాలైంది. టాలీవుడ్ తొలి కోటి కథానాయిక ఇలియానాకు తెలుగు పరిశ్రమ అంటే చులకనే. తెలుగులో హీరోలో ఆధిపత్యం ఉంటుంది. హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధ్యాన్యం ఉండే పాత్రలు ఇవ్వరనేది వీరి ప్రధాన ఆరోపణ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె తాజా బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అజయ్ దేవగణ్ కథానాయకుడు. టబు మరో కథానాయిక. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో రకుల్ 50 ఏళ్ల వ్యక్తికి ప్రేయసిగా కనిపించారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రకుల్ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. టాలీవుడ్ లో హీరోల ఆధిపత్యం రకుల్ స్పందించింది.

టాలీవుడ్లో హీరోలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ‘బాహుబలి’ ఓ పెద్ద సినిమా. అందులోని కథ మొత్తం అనుష్క చుట్టూ తిరుగుతుంది. ఆమె పాత్రను ఎంతో బలంగా రచించారు. చరణ్, బన్నీ, రవితేజ.. ఎంతో మంచి వారు. వారంతా గొప్ప డ్యాన్సర్లు. మీకు శరీరంలో ఎముకలు లేవా ? అని వారితో జోక్ చేస్తుంటా. వారంతా ఎంతో సామాన్యంగా ఉంటారు కాబట్టే అంతటి స్టార్డమ్ వచ్చిందని చెప్పుకొచ్చింది రకుల్. మొత్తంగా.. రకుల్ తెలుగు పరిశ్రమ గురించి గొప్పగా చెప్పడం విశేషం.
