సోనాలి ధైర్ఘ్యాన్ని మెచ్చుకోవాల్సిందే !

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే ప్రధాకరమైన కాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్లో చికిత్స పొందిన బింద్రే ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చింది. తాజాగా సోనాలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా ఉదర భాగంలో క్యాన్సర్ కణాలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయని స్కాన్ ద్వారా తెలిసింది. బతికే అవకాశం కేవలం 30 శాతం ఉందని న్యూయార్క్ వైద్యులు చెప్పినప్పుడు.. నా గుండె పగిలింది. కానీ చనిపోతాననే ఆలోచన నాకు రాలేదు. పూర్తిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని మాత్రం అర్థమైంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నా బలం అయ్యారు” అని తెలిపింది.
క్యాన్సర్తో పోరాడుతున్న మహిళలకు సోనాలి విలువైన సూచనలు చేశారు. వారికి ఎక్కువ జాగ్రత్త, సపోర్ట్ అవసరం. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ, అనురాగం పొందాల్సిన సమయమని తెలిపారు. కష్ట సమయంలో సోనాలి చూపిన ధైర్ఘ్యాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్’లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న సోనాలీ.. తెలుగులోనూ ఆమె నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. రోజా, ఖడ్గం, ఇంద్ర, మురారి మున్నాభాయ్ ఎంబీబీస్ సినిమాల్లో సోనాలీ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక్కడ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
