గుడ్ న్యూస్ : నాగ్ తాత కాబోతున్నాడు

అక్కినేని అభిమానులకి గుడ్ న్యూస్. నాగార్జున తాత కాబోతున్నాడు. ఈ వార్త విన్న తర్వాత నాగ చైతన్య ఆనందానికి అవధుల్లేకుందా పోయాయట. అలాగని.. చైతూ సతీమణి, హీరోయిన్ సమంత తల్లికాబోతుంది అనుకొనేరూ.. ! ఇది ‘బంగార్రాజు’ ముచ్చట. 2016లో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సూపర్ హిట్ అయింది. ఇందులో బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆ పాత్ర ఆధారంగా సినిమా చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం నాగ్ మన్మథుడు 2 తో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే ‘బంగార్రాజు’ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసిందే. ఇందులో నాగ్ తాత పాత్రలో కనిపిస్తారట. నాగ చైతన్య తాతగా నాగ్ కనిపిస్తారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వేంచేలా ఉంటాయని సమాచారమ్. ఇప్పటికే చైతూ- నాగ్ కలిసి ‘మనం’ సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి తండ్రి-కొడుకులు కలిసి తెరనుపంచుకోనున్నారు
