కోడలుతో రొమాన్స్ చేయడంలో నాగ్ రికార్డ్

మన్మథుడు నాగార్జున తన పేరిట సరికొత్త రికార్డుని నమోదు చేసుకొన్నారు. అటు తండ్రి, ఇటు తనయుడు హీరోయిన్స్ తో నాగార్జున నటించడం విశేషం. ఏఎన్నార్ – శ్రీదేవి జంటగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాతి కాలంలో నాగార్జున – శ్రీదేవి జంటగా సినిలొచ్చాయ్. సూపర్ హిట్ అయ్యాయి. వీరు హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకొన్నారు.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా కోసం నాగ చైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. వీరిమధ్య మంచి కెమెస్ట్రీ వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు రకుల్ నాగ్ రొమాన్స్ మొదలెట్టాడు. ‘మన్మథుడు 2’ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో అటు తండ్రి హీరోయిన్, ఇటు తనయుడు హీరోయిన్ తోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోగా నాగ్ సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు.

‘మన్మథుడు 2’ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాగ్ మన్మథుడు 2 ఫ్యామిలీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంప్లీట్ రొమాంటి ఎంటర్ టైనర్ గా రెండో మన్మథుడు రాబోతున్నాడు. అంతేకాదు.. ఇందులో సమంత గెస్ట్ రోల్ లో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది.
