బెయిర్‌స్టో ఫోర్ల వర్షం

130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఆరంభంలో అదరగొట్టింది. ఓపెనర్ బెయిర్‌స్టో(48) ఫోర్ల వర్షం కురిపించారు. కేవలం 28బంతుల్లోనే 48పరుగులు సాధించాడు. మోరీస్ వేసిన ఓవర్ లో నాలుగు ఫోర్లు, రబడ వేసిన ఓవర్ లో మూడు ఫోర్లు బాదేశాడు. చివరకు రాహుల్ తివాతియ వేసిన ఓవర్ లో బెయిర్‌స్టో ఎల్భీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ డేవిడ్‌వార్నర్‌(10) కూడా అవుటయ్యారు. విజయ్‌శంకర్‌(16), మనీశ్‌పాండే(10), దీపక్ హూడా (10) పరుగులు చేసి అవుటయ్యారు. దీంతో ఈజీగా గెలవాల్సిన సన్ రైజర్స్ ఎదురీదుతోంది. 17ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 114/5తో ఆటని కొనసాగితోంది. క్రీజులో యూసఫ్ పటాన్ 7, నబీ 2 పరుగులతో ఉన్నారు.

అంతకుముందు దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(11), శిఖర్‌ధావన్‌(12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కాగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(43).. రిషభ్‌ పంత్‌(5)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా పంత్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. పిచ్‌ నెమ్మదిగా మారడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా పెద్దగా రాణించలేదు. సన్‌రైజర్స్‌ బౌలర్లు భువనేశ్వర్‌, మహ్మద్‌ నబీ, సిద్ధార్థ్‌కౌల్‌ రెండేసి వికెట్లు తీయగా రషీద్‌ఖాన్‌, సందీప్‌శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.