యంగ్ ఇండియా మీద నమ్మకం లేదా ?

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మంది ఆటగాళ్లు, నలుగురు స్టాండ్ బై ప్లేయ‌ర్లతో జట్టును ఎనౌన్స్ చేసింది. ఐతే పెద్దగా ప్రయోగాలు లేకుండా జట్టును ప్రకటించడం విశేషం. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపించింది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని సైతం పక్కన పెట్టాలని విజ్ఞప్తులు వినిపించాయి. ఆ తర్వాత కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండటం ఖాయం అనే వార్తలు వినిపించాయి. అదేసమయంలో విరాట్ కోహ్లీ డౌటుఅనుమానమే అన్నారు. కానీ తాజా ఐఎపీఎల్ లోనూ అదరగొడుతున్న కోహ్లీని తీసుకోకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక మిగితా ఆటగాళ్ల విషయంలోనూ పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లిలేదు సెలక్టర్ కమిటీ.

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ను తీసుకున్నారు. ఇక టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లపై నమ్మకం ఉంచారు. నలుగురు ఆల్ రౌండర్లను ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, దూబె, అక్షర్ పటేల్ కు చోటు కల్పించారు. కుల్ దీప్ యాదవ్, చహల్ లు స్పిన్నర్ల కోటాలో బెర్త్ ఖాయం చేసుకున్నారు. బుమ్రా, సిరాజ్, అర్షదీప్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఎంపికయ్యారు. మొత్తంగా చూస్తే  జట్టు బాగానే కనబడుతున్న ఏదో లేటు ఉందనిపిస్తోంది.

గతంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్-కోహ్లీ మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ప్రజెంట్ ఐతే రోహిత్-హార్దిక్ మధ్య పరిస్థితి ఏమాత్రం బాగులేదని చెబుతున్నారు. తాజా ఐఎపీఎల్ లో భాగంగా ముంబై జట్టుకు ఆడుతున్న రోహిత్-హార్ధిక్ మధ్య అభిప్రాయ బేధాలు పలు వీడియోలతో స్పష్టమైంది. ఇదీగాక.. హార్దిక్ పెద్దగా ఫామ్ లో లేడు. అయితే కరెబియన్ పిచ్ లపై అతడి బౌలింగ్ పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని సెలక్టర్లు భావించి ఉంటారు.   

వాస్తవానికి  ఇండియాలో టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. రుతురాజ్ గైక్వాడ్ నుండి అశుతోష్ వరకు చాలా మంది ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో కొందరికి టీ20 వరల్డ్ కప్ లో అవకాశం రావొచ్చని భావించారు. కానీ రోహిత్, కోహ్లీ, పాండ్యా, జడేజా.. తదితర సీనియర్ల మీదనే మేనేజ్మెంట్ నమ్మకం ఉంచడం గమనార్హం.