అనుపమ్ ఖేర్ తో తారక్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి దుమ్మురేపుతున్నాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ సినిమా వార్ 2. ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ముంబైలోనే మకాం వేసిన జూనియర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తారక్ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ను కలిశారు. షూటింగ్ స్పాట్ లో కలిశారా ? లేక బయట కలిశారా ? తెలియదు. కానీ వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు వార్ 2 కూడా చేస్తున్నారు. ఎన్ టీఆర్ చేస్తున్న  డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఇది. ఇందులో యాక్షన్ హై లెవల్ లో ఉండనుంది. పోరాట దృశ్యాలు అబ్బురపరుస్తాయని చెబుతున్నారు. ఇక దేవర, వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. మొత్తానికి.. ఇక నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్  వరుస పాన్ ఇండియా సినిమాలతో అలరించబోతున్నారు.