‘ఉప్పెన’లా మెగా హీరో ఎంట్రీ

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ సినిమాకు రంగం సిద్ధమైన సంగతి తెలిసింది. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ శిష్యుడు బిచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ‘జాలరి’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే, ఈ సినిమా టైటిల్ ‘జాలరి’ కాదు ‘ఉప్పెన’ అని తెలిసిందే. ఇటీవలే ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారట. మెగా అభిమానులు మాత్రం జాలరి, ఉప్పెన రెండు టైటిల్స్ బాగున్నాయని.. ఏ టైటిల్ అయినా మాకు ఓకే అంటున్నారు.
పరువు హత్యల నేపథ్యంలో సినిమా ఉండబోతుందట. వాస్తవికతకి చాలా దగ్గరగా ఉంటుందని.. తొలి సినిమాకే వైష్ణవ్ తేజ్ నటన గురించి జనాలు మాట్లాడుకొనే రేంజ్ లో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కథని మెగా స్టార్ చిరంజీవి ఫైనల్ చేశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు.. ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకులని మెప్పించే కథ ఇదని తెలుస్తోంది. మొత్తంగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఉప్పెనలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
