మహేష్ కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లీకు.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లీకైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో మహేష్ మూడు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెండ్, బిజినెస్ మేన్, రైతు పాత్రలో మహేష్ ని చూడొచ్చు.

ఐతే, మూడింటిలో మహేష్ కాలేజ్ స్టూడెంట్ పాత్రని చూసి ముందు భయపడ్డాడట. అది కాస్త కష్టమేమో అనే డౌటుని దర్శకుడు ముందు వెలిబుచ్చాడట. ఎందుకంటే సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం. సుమారు 45 నుంచి 50 నిమిషాలు పాటు ఆ పాత్ర ఉంటుందట. ఇందుకోసం ఓ పదేళ్ల క్రితం మహేష్, పోకిరి టైం మహేష్ కనిపించాలని అనుకొన్నాడట. ఐతే, మీరు ఈజీగా చేసేస్తారని వంశీ కన్విన్స్ చేశాడట. మహర్షి సినిమాలో ప్రమోషన్ లో పాల్గొన్న మహేష్ తన కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ గురించి లీక్ చేశారు.

మహర్షి మొత్తం 2గంటల 40నిమిషాల సినిమా. ఇందులో మహేష్ కాలేజీ స్టూడెంట్ గానే 45నిమిషాల పాటు కనిపించబోతున్నాడు. ఇక మిగితా దాదాపు రెండు గంటల సినిమాలో మహేష్ బిజినెస్ మేన్, రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు మహర్షి లో రైతు పాత్రయే హైలైట్ గా ఉండబోతుందనే ప్రాచారం జరుగుతోంది.అంతకుమించి కాలేజీ స్టూడెంట్’గా మహేష్ అలరించ బోతున్నట్టుతెలిసింది.

ఇక, స్పెయిన్ టూర్ కి వెళ్లిన సమయంలో మహేష్ కాలేజీ కుర్రాడి లుక్ లోకి మారిపోయాడట. బరువు తగ్గి, గడ్డెం పెంచేసి.. అచ్చం కాలేజ్ స్టూడెంట్ లుక్ లోకి మారిపోయాడు. ఆ లుక్ ని చూసి దర్శకుడు వంశీ సప్రైజ్ అయ్యాడట. ఫైనల్ అదే లుక్ ని సినిమాలో సెట్ చేశారు. ఈ నెల 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.