నమ్రత జోక్యంపై మహేష్ వివరణ

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలంటే.. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ని మెప్పించాలి. ఆమె ఓకే చెబితే గానీ మహేష్ సినిమా ఒప్పుకోడు. చేయడు. సినిమా పరంగా లావాదేవీలు కూడా నమ్రతనే చూసుకొంటారనే ప్రచారం ఇండ్రస్ట్రీలో ఉంది. దీనిపై మహర్షి సినిమా ప్రమోషన్స్ లో మహేష్ స్పందించారు. “కథ వినడం, ఓకే చేయడం అంతా నేనే చూసుకొంటా. లక్కీలీ.. నమ్రతకు తెలుగు రాదు. దర్శకుడు చెప్పిన కథ ఆమెకు అర్థం కాదు. దీంతో ఆమె జోక్యం చేసుకోలేదు” అంటూ నవ్వేశాడు మహేష్.
మహేష్ నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందనే మహేష్ చెబుతున్నాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. మహేష్ అభిమానులు కాలరెగిరేసే సినిమా మహర్షి అని దర్శకుడు వంశీ అంటున్నారు. మహర్షి హిట్ పై గట్టి నమ్మకంతో ఉన్న చిత్రబృందం విడుదలకి ముందే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ప్లాన్ చేసుకుంటోంది. భారీ అంచనాల మధ్య ఈ నెల 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
