సప్రైజ్ : మహర్షిలో పవన్ కల్యాణ్ !

‘మహర్షి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శనమిచ్చారు. అలాగని మహర్షి చిత్రబృందం సప్రైజ్ ఏమీ ప్లాన్ చేయలేదు. మరీ.. మహర్షి సినిమాలోకి పవన్ ఎలా వచ్చాడు ? అంటే.. ఫ్యాన్స్ తీసుకొచ్చారు. ‘మహర్షి’ ట్రైలర్ లోకి పవన్ ని దించేశారు. పవన్ నటించిన కొమరంపులి, జల్సా, అత్తారింటికి దారేది.. తదితర సినిమాలో బిట్ సీన్స్ కలిపేసి పవన్ కథానాయకుడుగా మహర్షి టీజర్ ని రెడీ చేశారు. ఇందులో చాలా సీన్లు అతకలేదు. కానీ, కొన్ని సీన్లు బాగా కుదిరాయి.
బిజినెస్ మేన్ గా మహేష్ నడుచుకొంటూ వస్తున్న సీన్ కి అత్తారింటికి దారేదిలో పవన్ సీన్ కి సరిగ్గా కుదిరింది. ఇప్పుడీ వీడియోని చూసి మహేష్, పవన్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫ్యాన్ మేడ్ ‘మహర్షి’ ట్రైలర్ మీరు ఓ సారి చూసేయండీ.. !
