జానకమ్మ క్షేమంగా ఇంటికి.. !

ప్రముఖ గాయని ఎస్.జానకి క్షేమంగా ఇంటికి చేరుకొన్నారు. మైసూరులోని బంధువుల ఇంటికెళ్లిన జానకి ప్రదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె కాలుజారి క్రిందపడిపోయారు. దీంతో ఆమె తుంటి ఎముకకి గాయమైంది. వెంటనే జానకమ్మని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు చిన్నపాటి ఆపరేషన్ అవసరం కాగా.. చేసేశారు.
ప్రస్తుతం జానకమ్మ ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. సర్జరీ అనంతరం డిస్చార్జ్ అవుతూ మీడియాతో మాట్లాడిన జానకి అందరి ప్రార్థనల వలన తాను బాగానే ఉన్నానని అన్నారు. అంతకుముందు జానకమ్మ ఆసుపత్రిలో చేరిందన్న విషయం తెలిసి ఆమె అభిమానులు కంగారు పడ్డారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు ఫలించినట్టయింది. జానకమ్మ క్షేమంగా ఇంటికి చేరుకొన్నారు.
