బ్రేకింగ్ : ఫ్లే ఆఫ్’కు సన్ రైజర్స్


సన్ రైజర్స్ అభిమానులకి గుడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు చేరింది. వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ని 9 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ జట్టు చిత్తుగా ఓడించింది. దీంతో.. హైదరాబాద్‌‌ ప్లేఆఫ్‌ బెర్తుకి మార్గం సుగుమమైంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 133/7 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి పేసర్లు లసిత్ మలింగ (3/35), హార్దిక్ పాండ్య (2/20), జస్‌ప్రీత్ బుమ్రా (2/31) అద్భుతంగా బౌలింగ్ చేశారు.

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (55 నాటౌట్: 48 బంతుల్లో 8×4), సూర్యకుమార్ యాదవ్ (46 నాటౌట్: 27 బంతుల్లో 5×4, 2×6), డికాక్ (30: 23 బంతుల్లో 1×4, 3×6) దూకుడుగా ఆడటంతో ముంబయి జట్టు మరో 23 బంతులు మిగిలి ఉండగానే 134/1తో అలవోక విజయాన్ని అందుకుంది. ఆఖరి మ్యాచ్ లో కోల్ కతా ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరింది.

ముంబయి, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ కు చేరయి. మంగళవారం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. రాత్రి 7:30 నిమిషాల నుంచే ప్లే ఆఫ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.