మహేష్ థియేటర్’లో మహేష్ తొలిసారి.. !


సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి హైదరాబాద్ లో ‘ఏఎంబీ సినిమాస్’ పేరిట మల్లీప్లెక్స్ థియేటర్ ను నిర్మించి సంగతి తెలిసిందే. ఈ థియేటర్ అద్భుతంగా ఉంది పలువురు సినీ ప్రముఖులు కితాబిచ్చారు. ఇది కేవలం థియేటర్ మాత్రమే కాదు. ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అత్యాధునిక హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఆదివారం రాత్రి ఏఎంబీ సినిమాస్ లో మహేష్ హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ : ది ఎండ్ గేమ్ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఏఎంబీ సిబ్బందితో దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు మహేష్. ‘ఏఎంబీ సినిమాస్ లో తొలిసారి సినిమా చూశా. అవెంజర్స్ ని వీక్షించా. సినిమా బాగా నచ్చింది. ఎంజాయ్ చేశా’నని ట్విట్ చేశారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ వారం (మే9) ప్రేక్షకుల ముందుకు రానుంది.