తెరాసలో కాంగ్రెస్ విలీనానికి రంగం సిద్ధం


తెలంగాణ కాంగ్రెస్ శాసనపక్షాన్ని తెరాసలో విలీనం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల కంటే ముందే ఈ తంతుని పూర్తి చేయాలని తెరాస భావిస్తోంది.

గత యేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19స్థానాలని గెలుచుకొంది. నల్గొండ ఎంపీగా గెలిచిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి తగ్గింది. ఇక, ఇప్పటికే 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరబోతున్నట్టు తెలిపారు. మరో ముగ్గురు కూడా తెరాసలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.

ఈ నేపథ్యంలో 13మందికి పైగా టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీల్పీని తెరాసలో విలీనం చేయాల్సిందిగా స్వీకర్ కు లేఖ అందజేయనున్నారు. ఇప్పటికే టీడీపీ శాసనపక్షం తెరాసలో విలీనం అయిన సంగతి తెలిసింది. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి తప్పడం లేదు.