జెడ్ స్వీడుతో.. తెరాసలో సీఎల్పీ విలీనం !

తెరాసలో సీఎల్పీ విలీనం అయింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయంతీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి బులెటెన్ విడుదల చేశారు. దీంతో తెరాసలో సీఎల్పీ విలీనం సంపూర్ణమైంది.
శాసనసభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే తెరాస ప్లాన్ కు చాలా రోజుల క్రిందే పునాది పడింది. లోక్ సభ ఎన్నికల ముందు నుంచే తెలంగాణ కాంగ్రెస్ నేతలని ఒకొక్కరిని తెరాస ఆకర్షించింది. కానీ, చేర్చుకోలేదు. 11మందిని కలిపి ఓ గుంపుగా తయారు చేసింది. వారికి ఇంకో ఇద్దరు అవసరం. సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, కుదరలేదు.
ఈలోపు ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అదే సమయంలో తెరాసలో చేరేందుకు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఓకే చెప్పడం.. సీఎల్పీ విలీనం ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసింది గులాభి పార్టీ. జెడ్ సీడుతో విలీన ప్రక్రియని పూర్తి చేసింది. గురువారం మధ్యాహ్నం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభాపతిని కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆ వెంటనే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయంతీసుకోవడం, విలీనం ప్రక్రియ పూర్తయినట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీచేయడం చకా చకా జరిగిపోయాయి.
