ప్రపంచకప్’లో ఆ మూడు జట్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డాయా ?

ఆటల్లోనూ పాకిస్థాన్ నీచ బుద్దిని చూపిస్తోంది. పాక్ సెమీస్ కు చేరకపోవడానికి ప్రధాన కారణం టీమిండియానేనని పాక్ అభిమానులు ఆరోపిస్తున్నారు. టీమిండియా కావాలనే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఆఫ్గానీస్థాన్ మ్యాచ్ లోనూ స్థాయికి తగ్గట్టు ఆడలేదని కామెంట్స్ చేస్తున్నారు. భారత్ ఒక్కటే కాదు.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కూడా పాక్ ని తొక్కేశాయి. ఈ మూడూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయి. ఐసీసీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఐతే, ఈ ఆరోపణల వెనక ఓ కారణం ఉంది.
శుక్రవారం జరిగిన పాకిస్థాన్ X బంగ్లాదేశ్ లీగ్ మ్యాచ్ లో పాక్ గెలిచింది. దీంతో ఆ జట్టు 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమానంగా నిలిచింది. ఐతే, కివీస్ (+0.175) రన్‌రేట్ పాకిస్థాన్(-0.430) కన్నా మెరుగ్గా ఉండడంతో ఆ జట్టు నాలుగో స్థానంతో నాకౌట్ చేరింది. ఈ మ్యాచ్ లో పాక్ తొలి ఇన్నింగ్స్ తర్వాత ఐసీసీ చేసిన ఓ ట్వీట్ చేసింది. సర్ఫరాజ్ జట్టు సెమీస్ చేరాలంటే బంగ్లాను ఏడు పరుగులలోపే కట్టడి చేయాలి అని పేర్కొంటూ ఓ హాలీవుడ్ సినిమాకి సంబంధించి జిఫ్ ఫైల్‌ను పోస్టు చేసింది. దీనిపై పాక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఐసీసీతో పాటు పాక్ ని తొక్కేసిన జట్లుగా భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లని నిందిస్తున్నారు.
