సమంత కోరిక.. ఆ ఇద్దరితో !

తొలి సినిమాతోనే మేజిక్ చేసింది సమంత. ‘ఏం మాయ చేసావె’తో ప్రేక్షకులని మాయ చేసింది. ఆ మాయ ఇప్పటికి కొనసాగుతోంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే జోష్ చూపిస్తోంది. గత యేడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్న సామ్.. ఈ యేడాది కూడా వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది. మజిలీ హిట్ కిక్కు నుంచి బయటపడక ముందే ‘ఓ బేబీ’ రూపంలో మరో బంపర్ హిట్ అందుకొంది. ఈ ఆనందంలో తనలో దాగువున్న రెండు కోర్కెలని బయటపెట్టింది.

మణిరత్నం, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉందని తెలిపింది. మణిరత్నం సినిమాల్లో నటించాలని ఏ హీరోయిన్ కు ఉండదు. మరీ.. శేఖర్ కమ్ముల ఎందుకు ? అంటే.. ఆయన హీరోయిన్స్ కోసం మంచి కథలు రాస్తారనే నమ్మకముంది. అందుకు ‘ఫిదా’నే ఉదాహరణ. అందులో వరుణ్ తేజ్ హీరో అయినా.. కథని లీడ్ చేసింది సాయి పల్లవినే. ఆమె నటనే సినిమాకి హైలైట్. సమంత కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఆశపడుతుంది. మరీ.. గ్రేట్ దర్శకులు సామ్ కోరికని ఎప్పుడు తీరుస్తారో చూడాలి.