మహేష్ టైటిల్ కి గ్లామర్ టచ్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో టైటిల్ సాంగ్ అదిరిపోయేలా ఉంటది. మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ టైటిల్ సాంగ్ అద్భుతంగా ఉండబోతుందట. ఐతే, ఈ టైటిల్ సాంగ్ కి గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. టైటిల్ సాంగ్ లో చిందేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఐటమ్ సాంగ్ లో గ్లామర్ తో నింపేస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం కాస్త భిన్నంగా టైటిల్ సాంగ్ కి గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నాడట.
ఈ చిత్రంలో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆయనకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-అనిల్ సుంకర-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
