‘ఆవిరి’ ట్రైలర్ టాక్


రవిబాబు దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆవిరి’. నేహా చౌహాన్, భరణి శంకర్, ముక్తాఖాన్, శ్రీ ముక్తా, హిమజ, కాశీ విశ్వనాథ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

స్టోరీ లైన్ ని లీక్ చేస్తూ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మున్నీ అనే బాలిక జీవితంలో ఏం జరిగింది? ఒక ఇంటిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచిన ఆ బాలికను దెయ్యం బయటకు తీసుకెళ్లిందా ? పాపను కాపాడుకునేందుకు ఆమె తల్లిదండ్రులు ఏం చేశారు ? తెలియాలంటే ఆవిరి చూడాల్సిందే. 

ఈ చిత్రానికి వైద్య సంగీతం అందిస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పిస్తున్నారు. నవంబర్ 1న ఆవిరి ప్రేక్షకుల ముందుకు రానుంది.