రవితేజ ‘క్రాక్’ లుక్ చూశారా ?

బలుపు కాంబో రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన ‘బలుపు’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ‘క్రాక్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. పోలీస్ డ్రెస్ లో రవితేజ క్రాక్ లుక్ డిఫరెంట్ గా ఉంది.
ఇక వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’.నభానటేశ్.. పాయల్‌రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ దిల్లివాలా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన డిస్కోరాజా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
