‘ఆర్ఆర్ఆర్’ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇదేనా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం నుంచి సప్రైజ్ రాబోతుంది. న్యూ ఇయర్ కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్ ని వదలనున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఆర్ ఆర్ ఆర్ చిత్రం బృందం కూడా స్పందించింది. దానికోసం మేము కూడా ట్రై చేస్తున్నాం. ఆర్ఆర్ఆర్ న్యూ సప్రైజ్ ఉండనుందనే సంకేతాలిచ్చింది.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ కోసం అభిమానులు వెయ్యి కళ్లలో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలని అడియాశలు చేస్తూ పాత ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ పై కొత్తగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ రాసి వదిలారు. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు తీవ్రంగా నిరశ చెందారని చెప్పవచ్చు. ఇక ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయన జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ గా తారక్, ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే షూటింగ్ లో జాప్యం కారణంగా ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడనుందని చెబుతున్నారు. ఈ మేరకు ‘మత్తు వదలరా’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి హింట్ కూడా ఇచ్చారు.
