లేడీ సూపర్ స్టార్ రంగంలోకి దిగిపోయారు !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇందులో ఆమె ప్రొఫెసర్ భారతి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విజయశాంతి సరిలేరు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సరిలేరు సినిమా కంటే ముందే మరో సినిమా కోసం విజయశాంతిని అనిల్ అడిగారట. ఆ సమయంలో బిజీగా ఉండటం వలన నో చెప్పాను. అసలు నటించాలనే ఆసక్తి లేదు. కానీ అనిల్ వదల్లేదు. మరో సినిమా కోసం అంటూ ఒత్తిడి చేశారు. కథ వినడానికి మూడ్నాలుగు రోజుల సమయం అడిగాను. కథ విన్నాక మాత్రం.. నో చెప్పడానికి రీజన్ దొరకలేదు. అంత అద్భుతంగా రాశారు. వినోదం, ఎమోషన్స్ అన్నీ ఉన్న కథ ఇది. అద్భుతంగా ఉంటుంది. అనిల్ మరో పదేళ్లు ఇండస్ట్రీని ఏలుతాడని చెప్పుకొచ్చింది.. రాములమ్మ. ఆమె చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలని క్రింది వీడియోలో చూడండీ.. !
