కేంద్రం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్ ?

మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఎన్నో సంచలన నిర్ణయలు తీసుకొంది. ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు సీఏఏపై అదే విధంగా ముందుకెళ్తోంది. ఈ విషయం పక్కనపెడితే.. సోషల్ మీడియాని బ్యాన్ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే తాను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లకు స్వస్తి పలకాలనుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో దేశంలో సోషల్ మీడియాని బ్యాన్ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందా ? అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ప్రధాని మోడి ట్వీట్ పై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ‘ఇండియాలో సోషల్ మీడియాను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తుందేమో’నని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా మోడి ఈ హెచ్చరిక చేసి ఉంటారని శశి థరూర్ తన ట్వీట్లో వెల్లడించారు. మోడి చేసిన ట్వీట్‌పై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ‘విద్వేషాన్ని వదిలేయండి.. సోషల్ మీడియా అకౌంట్లను కాదు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020
