కరోనా వైరస్’కు మందు గోవు మూత్రం

ప్రపంచాని వణికిస్తోన్న కరోనా వైరస్ కి మందు లేదు. ఒకవేళ మందు కనిపెట్టిన.. దాన్ని కొనే స్థోమత ప్రజలకి లేదు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు కూడా అంగీకరించారు. మరో ఒకట్రెండు నెలల్లో కరోనా వైరస్ కు మందు రానుంది. ప్రయివేటు ఆరోగ్య సంస్థలు ఆ పనిలో బిజీగా ఉన్నాయి. అయితే, ఆ మందుని కొనుగోలు చేసే సామర్థ్యం అమెరికా ప్రజలకి లేదని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.

అగ్రరాజ్యం అమెరికా ప్రజలకే కరోనా వైరస్ కు మందు కొనుక్కొనే స్థోమత లేకుంటే.. ఇక మిగితా దేశాల ప్రజల గురించి చెప్పనక్కర్లేదు.
అయితే అస్సాం బిజెపి ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ మాత్రం గోవు మూత్రంతో కరోనా వైరస్ నయం అవుతుందన్నారు. అస్సాం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సమయంలో బంగ్లాదేశ్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న అంశంపై చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గన్న ఎమ్మెల్యే హరిప్రియ.. గోవుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి కూడా గోమూత్రం పనిచేస్తుందన్నారు. గోమూత్రం, ఆవుపేడలతో.. కరోనా వైరస్‌ను కూడా అదుపు చేయవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు.
