సుకుమార్ టెస్ట్’లో పాసైన రస్మిక

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకోనున్నారు. ఇటీవలే రస్మికకి టెస్ట్ లుక్ చేశారు. ఇందులో రస్మిక పాసైపోయింది. తాను రాసుకున్న పాత్రకు రస్మిక కరెక్ట్‌గా సరిపోతుందని సుక్కు అన్నారట. దీంతో.. రస్మిక హ్యాపీగా పీలవుతోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ తరహా పాత్రలో కనిపిస్తారట. ఈ పాత్ర కోసం బన్నీ చిత్తూరు యాసలో శిక్షణ తీసుకున్నారు. రష్మిక కూడా చిత్తూరు జిల్లాకు చెందిన యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నల్లమల అడవుల్లో ఉండే యువతిగా ఆమె కనిపించనుంది. ఆమె పాత్రకు శేషామణి అనే పేరును పెట్టినట్లు సమాచారమ్.
గతంలో సుకుమార్-బన్నీ కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
