గాంధీ ఆసుపత్రిలో 8 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలోకి ఇంకా కరోనా వైరస్ వ్యాపించలేదు. ఆదివారం వరకు వినిపించిన మాటలివి. దీంతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు హాయిగా జీవనం సాగించారు. సోమవారంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికార ప్రకటన చేసింది.

ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ? తాజాగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 8 మంది కరోనా వైరస్ అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వారంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌కు వెళ్లొచ్చినట్టు తెలిసింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, అధికారులు రఘునందన్‌రావు, యోగితారాణి, శాంతకుమారి, దానకిషోర్‌, లోకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.