కరోనా వైరస్’పై ఉపాసన ట్విట్

కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించింది. సోమవారం హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదైంది. దీనిపై మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేష్‌, అపోలో లైఫ్‌ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన ట్విట్ చేశారు. ‘సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం రోగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలి’ అని కోరారు.

చైనాలో బయటపడిన కరోనా వైరస్ భారత్ తో సహా 64 దేశాలకి వ్యాపించింది. చైనా కంటే వేగంగా ఇతర దేశాల్లో వ్యాపించేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పై అప్రమత్తం అయింది. వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, అధికారులు రఘునందన్‌రావు, యోగితారాణి, శాంతకుమారి, దానకిషోర్‌, లోకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.