మహేష్ వీరాభిమాని ఆత్మహత్య

కోలీవుడ్ నటి పద్మజ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై తిరువొట్టియూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో పద్మజ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పద్మజ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని. ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా పద్మజ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం 23 ఏళ్ల పద్మజ ఆర్ధిక సమస్యల వల్ల నిరాశకు లోనయ్యి ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. పద్మజ చనిపోయే ముందు.. ఆమె సోదరికి వీడియో కాల్ చేసి.. తన బాధలు, ఆర్ధిక సమస్యల గురించి చెప్పుకున్నారు. తమిళ సీరియల్స్‌లో పలు సహాయక పాత్రలు, వాణిజ్య ప్రకటనల, సినిమాలతో పద్మజ ప్రేక్షకులకు సుపరిచితురాలు.
