వైరల్ : ధోనీ ప్రాక్టీస్ వీడియో

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. గత యేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోని మళ్లీ బ్యాట్ పట్టుకోలేదు. మైదానంలోకి దిగలేదు. దాదాపు 8 నెలల తర్వాత ధోని మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. ఈ నెల 29న ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ సీజన్ 13 ప్రాక్టీస్ కోసం ధో ఆదివారం చెన్నై చేరుకున్నాడు. వచ్చి రాగానే ప్రాక్టీస్ మొదలెట్టాడు.
సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో మహీ పాల్గొన్నాడు. నెట్స్‌లో కాసేపు బ్యాటింగ్ చేశాడు. హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ధోనీ అలరించాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. అతడు బ్యాటు పట్టి అడుగుపెట్టే సమయంలో చిదంబరం స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. అభిమానులు ‘ధోనీ..ధోనీ.. ధోనీ.. ధోనీ’ అంటూ నినాదాలు చేశారు.
ధోనీ సాధనకు సంబంధించిన వీడియోను చెన్నె సూపర్ కింగ్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ధోని ప్రాక్టీస్ వీడియోని మీరు వీక్షించండి.
A grand waltz to take guard! #StartTheWhistles #SuperTraining 🦁💛 pic.twitter.com/tQbDqqnmT2
— Chennai Super Kings (@ChennaiIPL) March 2, 2020
