థమన్’ని ఫాలో అవుతున్న పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ను ట్విటర్‌లో 3.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం కేవలం 34 మందిని అనుసరిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నారు. మోదీ, అమిత్‌షా, కేటీఆర్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, తమన్ తదితరుల్ని పవర్‌స్టార్ ఫాలో అవుతున్నారు. తాజాగా పవన్ ఫాలోవర్స్ లిస్టులో సంగీత దర్శకుడు థమన్ కి చోటు దక్కింది.
ఈ సప్రైజ్ తో థమన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ‘ఇది నాకు అతి పెద్ద ఫ్యాన్ మూమెంట్. నా రోజును ఆనందంగా ప్రారంభించడానికి ఇంత కంటే మంచి కారణం ఏం కావాలి. వపన్ సర్ మీపై నాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. లవ్ యూ సర్’ అని థమన్ ట్వీట్ చేశారు. పవన్ రీ-ఎంట్రీ చిత్రం ‘అజ్ఝాతవాసి’కి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా ‘మగువా… ‘కి వచ్చింది. మంచి స్పందన దక్కించుకుంది.
One of the biggest happiesttttttttttt fannnnnnnnnnnnnnnnnnnnnn
moment
Can’t get a bigger way to start the day .
Sirrrrrrrrrrrr ♥️Lots of gratitude & respect sir
Love U sir
God bless ✊ pic.twitter.com/fX5CTClbLi— thaman S (@MusicThaman) April 4, 2020
