సొంత ఆఫీస్ ని క్వారంటైన్ కి ఇచ్చిన సూపర్ స్టార్ 

కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో  బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ భాగస్వామి అయ్యారు. తన నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ తరపున పీఎం కేర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమ వ్యక్తిగత కార్యాలయాన్ని మహిళలు, వృద్ధులు, చిన్నారులకు క్వారంటైన్‌గా ఉపయోగించుకోవచ్చని షారుఖ్ తెలిపారు. దీంతో షారుఖ్‌ అభిమానులు ట్విటర్‌ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, మీర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బందికి 50,000 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ కిట్లను అందజేయనున్నారు. ఏక్‌సాథ్‌ స్వచ్చంధ సంస్థతో కలిసి మీర్‌ ఫౌండేషన్‌ ముంబయిలోని 5500 కుటుంబాలకు నెల రోజులు పాటు భోజన వసతి కల్పించనున్నారు. అదే విధంగా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి 50వేల కిట్లు పంపిణీ చేస్తామన్నారు.