కరోనాపై రఘు కుంచె మాస్ సాంగ్.. అదిరింది !

కరోనా కట్టడి కోసం సినీ తారలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీడియోలు, పాటల రూపంలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ కార్మికులకి ఆర్థిక సాయం చేస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నారు. ఇక సంగీత దర్శకులు కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్‌, వాసూరావులతో పాటు గీత రచయితలు అనంత్‌ శ్రీరామ్‌, చంద్రబోస్‌లు కరోనాపై అవగాహన పాటలతో అలరిస్తున్నారు. వీరింతా కరోనాపై కాస్త క్లాస్ టచ్ తో పాటలు తీసుకొచ్చారు. తాజాగా గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కరోనాపై ఓ మాస్ సాంగ్ పాడారు.

“సెప్పిన మాట వినకుంటే ఓరి నాయనా.. సంకనాకి పోతావురా ఓరి నాయనా’ అంటూ సిరాశ్రీ అందించిన సాహిత్యాన్ని తనదైన శైలిలో ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బిట్ సీన్స్ ని ఇందులో ఉంచారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వినతులని చూపించారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని హిట్ డైలాగ్ మీకు అర్థమవుతుందా ? ని బాగా వాడేశారు.