తెలంగాణలో మరో 43 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 43 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 272కి చేరింది. మరో 11మంది మృతి చెందారు. దీనిపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. శనివారం కరోనా నుంచి కోలుకున్న ఒకరిని డిశ్ఛార్జ్ చేశారు. దీంతో దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 33కి చేరిందని మంత్రి తెలిపారు.
రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మరో రెండు రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ల్యాబుల్లో 24 గంటల పాటు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
