మోడీ-ట్రంప్ ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారంటే ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. శనివారం సాయంత్రం వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ తో ఫోన్ సంభాషణ గురించి ప్రధాని మోడీ ట్విట్ చేశారు.

‘మా సంభాషణ చక్కగా సాగింది. కొవిడ్‌-19పై పోరాడేందుకు భారత్‌, అమెరికా భాగస్వామ్య పూర్తి బలాన్ని వినియోగించేందుకు అంగీకరించాం’ అని మోదీ ట్వీట్‌లో చేశారు. ఇక అగ్రరాజ్యంలో శనివారం సాయంత్రానికి 278,458 కేసులు నమోదు కాగా 7,100 మందికి పైగా మృతిచెందారు. భారత్‌లో 3,072 కేసులు నమోదవ్వగా 75 మంది మరణించారు.