ఢిల్లీలో 445కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 445కి చేరినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. మొత్తం కేసుల్లో కేవలం 40 మందికి మాత్రమే స్థానికంగా ఈ వైరస్‌ సంకమ్రించిందని తెలిపారు. మిగిలిన వారందరూ విదేశీ ప్రయాణాలు చేసినవారు లేదా నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లిన వారేనని తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన 2300 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనివల్ల కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.