రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ కి తీవ్రగాయాలు

తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న కన్నడ హీరోయిన్ షర్మిలా మాండ్రే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అల్లరి నరేష్ నటించిన ‘కెవ్వుకేక’ సినిమాలో షర్మిల కథానాయిక పాత్ర పోషించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెంగళూరులోని వసంత్ నగర్లో ఉన్న రైల్వే వంతెన వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో షర్మిలతో పాటు ఆమె స్నేహితుడు లోకేష్ వసంత్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షర్మిల, లోకేష్ చికిత్స ఆసుపత్రిలో తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన ఈ సమయంలో వీరు కారులో సరదాగా బయటికొచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.
