పాతబస్తీలో కానిస్టేబుల్ పై దాడి

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ కఠిన సమయాన తమ ప్రాణాలని పణంగా పెట్టి డాక్టర్లు, పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారిపై దాడి ఘటనలు వెలుగుకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వైద్యం చేసిన డాక్టర్లని ఉరికించి ఉరికించి కొట్టిన ఘటనని చూశాం. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో కానిస్టేబుల్ పై దుండగులు దాడి చేశారు.
పాతబస్తీ బాబానగర్ వద్ద విధుల్లో ఉన్న చాంద్రాయణగుట్ట కానిస్టేబుల్ ప్రవీణ్‌పై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. అపసవ్య దిశలో వచ్చి కానిస్టేబుల్‌ను రాడ్డుతో కొట్టి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి గాయపడ్డ కానిస్టేబుల్‌ను కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
