సుమ ఇలా సాయం చేస్తోంది

కరనా కట్టడి కోసం దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ కార్మికులని ఆదుకునేందుకు సినీతారలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిసిసి మీ కోసం సంస్థకి విరాళాలు వెలువెత్తుతున్నాయి. మరికొందరు నటీనటులు తమదగ్గర పనిచేసే సినీ కార్మికులకి నేరుగా సాయం చేస్తున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కూడా ఇదే చేస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ సుమ తన ఫోస్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

“నమస్కారం. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న తరుణంలో నేను కూడా నావంతు సాయం చేశాను. కొన్ని వృద్ధాశ్రమాలకు, నిర్మాతల మండలికి సాయం అందించాను. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్‌ లిస్ట్‌ తయారు చేసుకున్నాను. వాళ్ల అవసరాలను అడిగి తెలుసుకున్నాను. అలాగే నా షోల కోసం పనిచేస్తున్న మరికొంతమంది లిస్ట్‌ తయారుచేసుకున్నాను. వాళ్లు ఎలాంటి సంఘాల్లో కూడా సభ్యులు కారు. అయితే అవసరాలు ఉన్నా వారందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను వెళ్లి సామగ్రిని అందించలేను. కాబట్టి నాకు వీలైనంత ఆర్థిక సాయం చేస్తాను. మీరు కూడా ఇలా డైరెక్ట్‌ స్టాఫ్‌, ఇన్‌డైరెక్ట్‌ స్టాఫ్‌ లిస్ట్‌లు తయారు చేసుకుంటే సాయం చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది” అని రాసుకొచ్చింది.