నయన్ ఆ లోటు తీర్చింది

హీరోయిన్స్ కరోనా సాయం చేయరా ? ఈ మధ్య బాగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు సినీతారలు ముందుకొచ్చారు. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు, కుర్ర హీరోలు, చిన్నా చితకా నటులు తమవంతుగా సాయం ప్రకటించారు. కానీ హీరోయిన్స్ నుంచి ఒకరిద్దరు తప్ప ఎవరూ కరోనా సాయం ప్రకటించలేదు.

దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. హీరోయిన్స్ ఎందుకు విరాళాలు ప్రకటిచరని నటుడు బ్రహ్మాజీ అడిగేశాడు, కడిగేశాడు. అయినా హీరోయిన్స్ పైసా తీయడం లేదు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.20 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈమేరకు ఆమె ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు చెక్కును అందించారు. దీంతో మిగితా హీరోయిన్స్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వారు ముందుకొచ్చి కరోనా సాయం ప్రకటించే అవకాశాలు లేకపోలేవు.