టాలీవుడ్ యాక్షన్ ప్లాన్ ఏంటీ ?

గాసిప్ వెబ్ సైట్లపై టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై నాలుగు వెబ్ సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, తన కెరీర్ ను నాశనం చేసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. #KillFakeNews పేరిట ఓ వీడియోని విడుదల చేశారు విజయ్. గాసిప్ వెబ్ సైట్లపై ఓ రేంజ్ లో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో  విజయకి  సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. నీకు అండగా ఉన్నామంటూ  ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, నాగబాబు, కొరటాల శివ, రవితేజ, రానా, క్రిష్, వంశీ పైడిపల్లి తదితరులు విజయ్ కి అండగా నిలిచారు. కింగ్ నాగార్జున కూడా స్పందించారు. చిరంజీవి ట్వీట్ పై ఆయన స్పందిస్తూ… సినీ పరిశ్రమలోని సహచరుడికి అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు.

మరీ.. నిజంగానే గాసిప్ వెబ్ సైట్ల టాలీవుడ్ ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుందా ? చేస్తే అది ఎలా ఉండబోతుంది ?? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అందరు కరోనా మూడులో ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక.. గాసిప్ వెబ్ సైట్ల పై టాలీవుడ్ ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !