కత్రినా అనుకోకుండా ఆ పని చేసింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని మేకప్ లేకుండా చూసే అవకాశం అభిమానులకి దక్కింది. కత్రినా అనుకోకుండా ఇన్ స్టా గ్రామ్ లైవ్ బటన్ నొక్కేసింది. నిజంగానే కత్రినా లైవ్ లోకి వచ్చారనుకొని చాలా మంది అభిమానులు జాయిన్ అయ్యారు. దీంతో ఏం చేయాలో తోచక కత్రినా అయోమయంలో పడింది.
ఆ సమయంలో కత్రినా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అభిమానులని ఆకట్టుకున్నాయి. ఆ వీడియో కత్రినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. మేకప్ లేకుండా కూడా మీరు బాగున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా కత్రినా మేకప్ లేకున్నా.. కత్తిలా ఉంది. కావలంటే.. మీరు ఆ వీడియోని చూసేయండీ.. !
